Rythu Bandhu : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చింది రైతు బంధు పథకాన్ని. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎక్కడా తగ్గలేదు సీఎం కేసీఆర్. వాళ్లకు షాక్ ఇచ్చేలా రైతులకు మేలు చేకూర్చేలా ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు.
11వ విడత రైతు బంధు పథకం పూర్తయింది. రైతుల ఖాతాల్లోకి రూ. 7,624 కోట్లు జమ చేసింది సర్కార్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 68.99 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందింది.
Rythu Bandhu Completed
ఇదిలా ఉండగా రైతు బంధు(Rythu Bandhu) పథకం కింద 11 విడతలుగా జమ చేశారు. ఇప్పటి వరకు రూ. 72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ జమ చేసింది. ఇది భారత దేశ చరిత్రలోనే ఓ రికార్డుగా చెప్పవచ్చు.
రైతులకు సాగు చేసేందుకు గాను పెట్టుబడి సాయం కింద కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇదే ఆయనను కాపాడుతూ వస్తోంది. ప్రధానంగా ఒక్కో రైతు కుటుంబంలో కనీసం ఐదు లేదా 10 మంది కుటుంబ సభ్యులు ఉంటారు.
ఈ పథకాన్ని పొందిన ప్రతి ఒక్కరు కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీరామ రక్షగా మారింది సర్కార్ కు.
Also Read : Bonthu Rammohan : బీఆర్ఎస్ వీడను ఏ పార్టీలో చేరను