Telangana Govt Denied : స్వంత నిధులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు
స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Govt Denied : తెలంగాణలోని కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ. 86 వేల కోట్లు ఇచ్చిందంటూ జార్ఖండ్ బీజేపీ ఎంపీ లోక్ సభలో సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తెలంగాణ బీఆర్ఎస్(BRS Party) సర్కార్ నిప్పులు చెరిగింది. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana Govt Denied Viral
కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కల. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వంత నిధులు, రుణాల పైనే ఆధారపడి ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును పూర్తి చేసిందని స్పష్టం చేసింది. కాళేశ్వరానికి కేంద్ర సర్కార్ ఎలాంటి నిధులు ఇవ్వలేదని పేర్కొంది.
ఇందుకు సంబంధించి జూలై 22, 2021 నాడు సాక్షాత్తు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై లోక్ సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తమ స్వంత నిధులు, వనరులతో నిర్మించిందన్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని , గౌరవ సభ్యుడు ఆధారాలు లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Also Read : V Srinivas Goud : రేవంత్ కలెక్షన్ కింగ్ – శ్రీనివాస్ గౌడ్