KTR : 3డీ ప్రింటింగ్ పై తెలంగాణ ఫోక‌స్

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

KTR  : ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ అని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). టీ హ‌బ్ లో 3డీ ప్రింటింగ్ ప్ర‌త్యేక ల్యాబ్ ను ఏర్పాటు చేశామ‌న్నారు. టీ వ‌ర్క్స్ ద్వారా అనేక ర‌కాలైన ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామ‌ని చెప్పారు.

శుక్ర‌వారం హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో మెడిక‌ల్ డివైజెస్ , ఇంప్లాంట్స్ లో 3డీ ప్రింటింగ్ పై జాతీయ స‌దస్సు జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్(KTR) ప్ర‌సంగించారు. ఇదిలా ఉండ‌గా వివిధ సంస్థ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందాలు చేసుకున్నాయి.

3డీ ప్రింటింగ్ ద్వారా స‌ర్జ‌న్లు, రోగుల‌కు వైద్య సేవ‌ల‌ను మ‌రింత మెరుగు ప‌రిచే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ రంగానికి ప్ర‌యారిటీ ఉంద‌న్నారు. దాని వ్యాపారం బిలియ‌న్ల‌లో ఉంద‌ని వెల్ల‌డించారు కేటీఆర్.

2020లో 1.7 బిలియన్ డాల‌ర్లుగా ఉంద‌ని, అది 2027 నాటికి 7.1 బిలియ‌న్ల‌కు చేరుతుంద‌ని జోష్యం చెప్పారు మంత్రి. ఆర్థో పెడిక్, డెంట‌ల్ తో పాటు ప‌లు విభాగాల్లో రోగుల్లో ఇంప్లాంట్ల‌కు హెవీ డిమాండ్ ఉంద‌న్నారు.

అమెరికా, యూరోపియ‌న్ మార్కెట్ల లో ఇప్ప‌టికే ఆ సాంకేతికత దూసుకు పోతోంద‌ని చెప్పారు కేటీఆర్. త్వ‌ర‌లో ఉస్మానియాలో నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఆడిట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సెంట‌ర్ తో ఈ రంగంలో దేశం పురోగ‌తి సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

త‌మ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఫార్మా రంగానికి ప్రోత్సాహం ఇస్తోంద‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో టీ హ‌బ్ , వీ హ‌బ్ , అగ్రి హ‌బ్, ఫార్మా హ‌బ్ గా తెలంగాణ కేరాఫ్ గా నిలిచింంద‌న్నారు మంత్రి కేటీఆర్.

Also Read : ట్విట్ట‌ర్ కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!