IAS Officers : ఐఏఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం

సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

IAS Officers : హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. సీఎంగా బాధ్య‌తలు స్వీక‌రించిన వెంట‌నే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎంవో ముఖ్య కార్య‌ద‌ర్శిగా సీనియ‌ర్ ఐఏఎస్(IAS) ఆఫీస‌ర్ శేషాద్రిని నియ‌మించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివ ధ‌ర్ రెడ్డిని నియ‌మించారు. అంతే కాకుండా హైద‌రాబాద్ న‌గ‌రానికి సంబంధించి కీల‌క‌మైన ముగ్గురు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మించారు.

IAS Officers Transfers Viral

వీరిలో కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి, సుధీర్ బాబు, మ‌హంతిల‌కు ఛాన్స్ ఇచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను మార్చేశారు. రేప‌టి ఎల్లుండి భారీ ఎత్తున ఐఏఎస్ ల‌ను కూడా బ‌దిలీలు చేయ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా తేలి పోయింది.

ప్ర‌స్తుతం కేంద్ర స‌ర్వీసులో ఉన్న అమ్రాపాలికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ గా, ఎంఆర్డీసీఎల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించారు సీఎం. వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ గా బి. గోపి, ఇంధ‌న కార్య‌ద‌ర్శిగా స‌య్య‌ద్ రిజ్వీ, ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషార‌ఫ్ అలీ, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా క‌ర్నాటి వ‌రుణ్ రెడ్డిని నియ‌మించారు రేవంత్ రెడ్డి.

ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా శైల‌జా రామ‌య్య‌ర్ , డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్క‌ర్ , ట్రాన్స్ కో జేఎండీ గా సందీప్ కుమార్ ఝాకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Also Read : CM Revanth Reddy : కొత్త హైకోర్టు భ‌వ‌నానికి గ్రీన్ సిగ్న‌ల్

Leave A Reply

Your Email Id will not be published!