TREIRB Govt Jobs : తెలంగాణ గురుకులాల్లో 9,231 జాబ్స్
9,231 కొలువుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
TREIRB Govt Jobs : ఓ వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం దర్యాప్తు కొనసాగుతుండగానే మరో వైపు గురుకులాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(TREIRB Govt Jobs) రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అపనమ్మకంతో ఉన్నారు నిరుద్యోగులు. ఏదీ పారదర్శకంగా జరుగుతుందన్న భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి గురుకులాల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు అభ్యర్థులు.
టెట్ పాసైనా ఇప్పటి వరకు డీఎస్సీ నిర్వహించ లేదు. వేలాదిగా టీచర్ , అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది పక్కన పెడితే తాజాగా తెలంగాణలోని గురుకులాల్లో మొత్తం 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం కీలక ప్రకటన చేసింది. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) వివరాలు తెలిపింది. డిగ్రీ కాలేజీల్లో 808 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వీటితో పాటు టీజీటీ పోస్టులు 4,020 ఉండగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ , లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అంతే కాకుండా పాఠశాలల్లో 1270 పీజీటీ, 434 గ్రంథపాలకులు, 275 ఫిజికల్ డైరెక్టర్ , 134 ఆర్ట్స్ , 92 క్రాఫ్ట్స్ , 124 మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం అవుతుందని మల్లయభట్టు వెల్లడించారు.
Also Read : అవాస్తవం రాజీనామా అబద్దం
