High Court TSPSC : టీఎస్పీఎస్సీ కేసు 24కు వాయిదా
స్పష్టం చేసిన హైకోర్టు
High Court TSPSC : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో చోటు చేసుకున్న ప్రశ్నా పత్రాల లీకేజీల వ్యవహారం. ఇప్పటికే 17 మందిని అదుపులోకి తీసుకుంది సిట్. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలువురిని ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ , సభ్యులు, కార్యదర్శిని , ఇతర ఉద్యోగులను కూడా విచారించింది. ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.
కంప్యూటర్ లో పొరపాటు జరిగితే తనకు ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు. మంత్రి కామెంట్స్ పై భగ్గుమన్నాయి ప్రతిపక్షాలు. ఈ పేపర్ లీకేజీ వెనుక కల్వకుంట్ల సర్కార్ హస్తం ఉందంటూ ఆరోపించాయి. సిట్ ఏర్పాటు వల్ల న్యాయం జరగదని, కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీకి అప్పగించాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , టీజేఎస్ చీఫ్ కోదండరాం , వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మొత్తం లీకుల వ్యవహారం హైకోర్టుకు(High Court TSPSC) చేరింది. మంగళవారం దీనిపై విచారణ చేపట్టింది. ఏప్రిల్ 24కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
సీల్డ్ కవర్ లో సిట్ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. మొత్తం 18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. ఒకరు న్యూజిలాండ్ లో ఉన్నారని వారిని పట్టుకుంటామని తెలిపింది. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు అడ్వొకేట్ జనరల్. ఇదిలా ఉండగా సిట్ విచారణ వివరాలు ఎలా లీక్ అయ్యాయంటూ పిటిషనర్ తరపు లాయర్ వివేక్ థన్కా వాదించారు.
Also Read : వయనాడులో రాహుల్ హల్ చల్