TS High Court Sharmila : షర్మిల యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వ్యక్తిగత దూషణలు చేయొద్దంటూ ఆదేశం
TS High Court Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చేలా పాదయాత్రకు పర్మిషన్(TS High Court Sharmila) ఇచ్చింది.
ఆమె ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు 3,500 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. ప్రజలతో కలుస్తూ ప్రధానంగా సీఎం కేసీఆర్ ను, ఆయన పార్టీని, కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు.
సోమవారం వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో షర్మిలకు చెందిన కారు, ప్రచారం రథం (బస్సు)పై దాడికి పాల్పడ్డారు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు.
ఇవి ఎలా వచ్చాయో ప్రజలు అడగాలని కోరారు. దీంతో ఆమెను నర్సంపేట పోలీసులు అడ్డుకుని వరంగల్ కు తరలించారు. అక్కడి నుంచి షర్మిల ధ్వంసమైన కారు, బస్సుతో హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యింది.
తనపై దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ను ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. న్యూసెన్స్ కింద షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో తనను కావాలని ప్రభుత్వం అడ్డుకుంటోందని, తన యాత్రపై దాడికి దిగుతోందంటూ , పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు షరతులతో పర్మిషన్ ఇచ్చింది యాత్రకు.
Also Read : షర్మిల అరెస్ట్ దురదృష్టకరం