Telangana High Court: భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
భూదాన్ భూముల కేసులో ఐపీఎస్‌లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
Telangana High Court : భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) షాక్ ఇచ్చింది. భూదాన్ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి కోర్టు నిరాకరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అదే బెంచ్‌లో వెకేట్ పిటిషన్ వేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాదు విచారణ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్ కు ఎందుకు వచ్చారని మండిపడింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని… ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది.
Telangana High Court Shock IPS
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోనిసర్వే నెంబర్ 194లో పలువురు ఐపీఎస్ అధికారులు భూములు కొన్న విషయం తెలిసిందే. అయితే ఇవి భూదాన్ భూములని… కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం… 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. అవి భూదాన్ భూములే అని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్(IPS) అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని..హైకోర్టులో ఐఏఎస్ ఐపీఎస్‌ల అప్పీళ్లు చేశారు. తాము కొన్న భూములు భూదాన్‌వి కాదని,పట్టా భూమూలేనంటూ ఐఏఎస్, ఐపీఎస్‌ల పిటిషన్‌లు వేశారు.
ఐపీఎస్‌లు రవిగుప్తా, తరుణ్ జోషి, బి.కె రాహుల్ హెగ్డే, జితేందర్ కుమార్ గోయల్ భార్య రేణుగోయల్, ఐఏఎస్ జనార్థన్ కుమారుడు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్ లు మహేశ్ భగవత్, సౌమ్య మిశ్ర, స్వాతి లక్రా, ఉమేష్ షరాప్ ఆర్య రేఖలతో పాటు వీరన్నగారి గౌతం రెడ్డి అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా… పిటిషనర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అంతే కాకుండా ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. తిరిగి సింగ్ బెంచ్‌లో అప్పీళ్లు చేసుకోవాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు డివిజిన్ బెంచ్ ముగించింది.
Also Read : Prisoner: అత్యాచారం చేసిన మహిళను జైలులోనే పెళ్లి చేసుకున్న ఖైదీ