Telangana Ministers : మంత్రులకు శాఖల కేటాయింపు
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Ministers : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడు పెంచారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంత్రులుగా కొలువు తీరిన వారికి శాఖలు కేటాయించారు. ఇక డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన మల్లు భట్టి విక్కమార్కకు కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించారు. ఇక మరో కీలకమైన శాఖ హోం శాఖను నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు.
Telangana Ministers in Detail
ఇదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్ శాఖ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. వారిలో కొండా సురేఖకు స్త్రీ, మహిళా సంక్షేమం ఇవ్వగా ములుగు నియోజకవర్గం నుంచి భారీ తేడాతో గెలుపొందిన దాసరి సీతక్క కు గిరిజన శాఖను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి.
దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖను ఇవ్వగా తుమ్మల నాగేశ్వర్ రావుకు రోడ్లు, భవనాల శాఖ ను అప్పగించారు. గత ప్రభుతత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజ నరసింహకు ఆరోగ్య శాఖను కేటాయించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల శాఖ , పొన్నం ప్రభాకర్ గౌడ్ కు బీసీ సంక్షేమం అప్పగించారు రేవంత్ రెడ్డి. ఇక జూపల్లి కృష్ణా రావుకు పౌర సరఫరాల శాఖను కేటాయించారు.
Also Read : Pragathi Bhavan Fencing : ఇనుప కంచెలు తొలగింపు