Telangana Ministers : మాజీ సీఎంకు పరామర్శల వెల్లువ
మంత్రులు దామోదర..దుద్దిళ్ల
Telangana Ministers : హైదరాబాద్ – ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జారి పడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. తాజాగా కలిసిన వారిలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజ నరసింహ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు.
Telangana Ministers Met KCR
వీరితో పాటు ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ కేసీఆర్ ను పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని , ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేఏ పాల్.
ఇదిలా ఉండగా కేసీఆర్(KCR) కు సంబంధించి ఆపరేషన్ పూర్తయిందని, సక్సెస్ అయ్యిందని ఆయన త్వరగా లేచి నడుస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు యశోద ఆస్పత్రి వైద్యులు. అయితే కేసీఆర్ బరువు మోసే స్థితిలో లేరని, ఆయన కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందన్నారు.
బహుశా కనీసం 6 వారాలకు పైగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కొడుకు మాజీ మంత్రి కేటీఆర్ , అల్లుడు తన్నీరు హరీశ్ రావు, కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Also Read : Akbaruddin Owaisi : కోలుకుంటారు తిరిగి వస్తారు