KTR Telangana : వ్యవసాయం దండుగ కాదు పండుగ
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
KTR Telangana : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR Telangana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం భారంగా ఉండేదన్నారు. కానీ ఇవాళ యావత్ తెలంగాణ ఆకుపచ్చగా మారిందని పేర్కొన్నారు. వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగ అని చేసి చూపించామని స్పష్టం చేశారు. ఇందుక సంబంధించి ట్విట్టర్ వేదికగా ఆయన సాగుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. సిసలైన నాయకుడు కేసీఆర్ సారథ్యంలో భవిష్యత్తు తెలంగాణదేనని చేసి చూపించారని కొనియాడారు.
నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైందని పేర్కొన్నారు. కరవు నేలగా అల్లాడిన తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వ పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నకు అందిస్తున్న వరాల వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైందని స్పష్టం చేశారు కేటీఆర్.
రైతు బంధుతో పంటకు పెట్టుబడి, బీమాతో ధీమా, 24 గంటల ఉచిత విద్యుత్ , రైతు వేదికలతో భరోసా, సకాలంలో ఎరువులు, విత్తనాలు , ప్రాజెక్టుల పూర్తిగా పుష్కలంగా సాగు నీరు, పండించిన ధాన్యం కొనుగోలు, అనుబంధ రంగాలకు ప్రయారిటీ ఇచ్చామని తెలిపారు. హరిత విప్లవం ఆహార ధాన్యాల ద్వారా సాధించామని, శ్వేత విప్లవం పాడి పరిశ్రమ ద్వారా, నీలి విప్లవం మత్స్య పరిశ్రమ ద్వారా, పింక్ విప్లవం మాంసం ఉత్పత్తిలో , పసుపు విప్లవం నూనె గింజలలో సాధించామన్నారు కేటీఆర్.
Also Read : Jyestabhishekam