Police Jobs Row : అభ్యర్థులు ఆగ్రహం దున్నపోతుకు విన్నపం
న్యాయం చేయక పోతే ఆందోళన ఆపం
Police Jobs Row : తెలంగాణ సర్కార్ పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా కేవలం రాబోయే ఎన్నికల కోసం మభ్య పెట్టేందుకు నోటిఫికేషన్లు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలపై మండిపడ్డారు(Police Jobs Row) అభ్యర్థులు.
ఇప్పటి వరకు భర్తీకి సంబంధించి ప్రక్రియ ముగిసినా ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇష్టానుసారంగా వ్యవహరించిందని, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ తమ పాలిట శాపంగా మార్చేలా చేశారంటూ వాపోయారు. తాము వీరి కారణంగా తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోందంటూ ఆందోళన చెందారు.
ఎక్కడా లేని రీతిలో రూల్స్ విధించడం వల్ల విలువైన కాలాన్ని కోల్పోవాల్సి వస్తోందన్నారు. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
వీరికి అండగా టీపీసీసీ, బీజేపీ కూడా నిలబడ్డాయి. కానీ సర్కార్ మాత్రం స్పందించడం లేదంటూ ఆరోపిస్తున్నారు అభ్యర్థులు. ప్రగతి భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు.
ఏకంగా దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వ్యవహారం. ఇకనైనా సర్కార్ మేలుకోవాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాలలో భర్తీ ప్రక్రియ సజావుగా సాగినా తెలంగాణలో మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు.
Also Read : రైతన్నల ఆగ్రహం పతనం ఖాయం