#AiKtrTelangana : కృత్రిమ మేధస్సులో మనమే నెంబర్ వన్
కృత్రిమ మేధస్సు ద్వారా సామాజిక ఆవిష్కరణలకు ఆరు అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఐటీ శాఖ. గత ఏడాది సాధించిన విజయాలతో ఈ మేరకు ప్రగతి నివేదికను విడుదల చేసింది.
కృత్రిమ మేధస్సు రంగాన్ని ఎంచుకుంటే భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంది. ఐటీ రోజు రోజుకు శరవేగంగా దూసుకెళుతోంది. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్, సాఫ్ట్ వేర్ టెస్టింగ్ లపై పట్టు బిగిస్తే జిందగీలో ఓ టాప్ పొజిషన్ లోకి చేరుకుంటారు. క్లిష్ట..కష్టతరమైన పనులన్నీ వేగంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా చేసుకునే వీలు వీటి ద్వారా కలుగుతుంది. కృత్రిమ మేధస్సు ద్వారా సామాజిక ఆవిష్కరణలకు ఆరు అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఐటీ శాఖ. గత ఏడాది సాధించిన విజయాలతో ఈ మేరకు ప్రగతి నివేదికను విడుదల చేసింది. ఏఐ సెక్టార్ కు సంబంధించి తెలంగాణ టాప్ లో నిలిచింది. కరోనా కష్ట కాలంలోను రాష్ట్రం ఐటీ పరంగా పురోగమించడం విశేషం. దేశంలోనే ఐటీ హబ్ గా పేరొందిన భాగ్యనగరం టాప్ ప్రయారిటీలో కొనసాగుతున్న కృత్రిమ మేధస్సు నిలవడం గమనార్హం.
ఏఐ ద్వారా సామాజిక ఆవిష్కరణలు చేయడంలో తెలంగాణను సెంట్రల్ పాయింట్ గా నిలబెట్టేందుకు చర్యలు చేపట్టింది. రాబోయే రోజుల్లో దీనిపైనే ఎక్కువగా కేంద్రీకరించేలా చేస్తోంది. ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు విధానం అమలు వేగవంతం చేసేందుకు తెలంగాణ ఏఐ మిషన్ ను ఏర్పాటు చేసింది ఐటీ శాఖ. ఏడాది కాలంలో ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఎన్ విడియా, మైక్రోసాఫ్ట్, ఐఐటీహెచ్, తదితర ఆర్గనైజేషన్లు, కంపెనీల సహకారంతో 120 కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో ఏఐ వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలతో బహుళ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.
ఇంకో వైపు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మిషన్ ప్రాధాన్యత రంగాలను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే బీజేపీ సర్కార్ దేశాన్ని డిజిటల్ టెక్నాలజీ వైపు మళ్లించే పనిలో పడ్డారు. ఈ మేరకు స్టాండప్ ఇండియా పేరుతో లక్ష కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ ఫండింగ్ ముఖ్య ఉద్ధేశం అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు వినూత్నఐడియాలను ప్రోత్సహించడం. ఆ దిశగా నేరుగా ఎవరైతే భిన్నమైన ఐడియాలతో ముందుకు వస్తారో, వారికి అన్ని సౌకర్యాలతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేయాలని నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉపాధి కల్పించే సంస్థగా, వ్యవస్థగా తయారు చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇంక్యూబ్ సెంటర్లను ఏర్పాటు చేయడం. అవగాహన సదస్సులు నిర్వహించడం, తక్కువ ఖర్చుకే ఐటీని డామినేట్ చేస్తున్న కోర్సులలో ప్రావీణ్యం సాధించేలా చేసేలా సర్కార్ చూస్తోంది. ఇందులో అత్యధికంగా ఏఐ, ఎంఎల్, ఎస్ఎస్ దాని మీదే కేంద్రీకరించనుంది.

No comment allowed please