KTR : బొమ్మ‌ల త‌యారీ పార్క్ తో ఉపాధి

స్ప‌ష్టం చేసిన మంత్రి కేటీఆర్

KTR : తెలంగాణ టాయ్స్ (బొమ్మ‌లు) పార్క్ ఏర్పాటు వ‌ల్ల వేలాదిగా ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు మంత్రి కేటీఆర్(KTR). ఇది ఆర్థిక వృద్దికి, తోడ్పాటుకు మార్గం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా దండు మ‌ల్కాపూర్ లో మంగ‌ళ‌వారం తెలంగాణ టాయ్స్ పార్కుకు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

మృదువుగా ఉండే బొమ్మలు, స్టెమ్ బొమ్మ‌లు, ఎల‌క్ట్రానిక్ ,ప్లాసిక్ , నాన్ టాక్సిక్ , సిలికాన్ బొమ్మ‌లు ఇందులో త‌యారు కానున్నాయ‌ని చెప్పారు. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించ‌ని బొమ్మ‌ల త‌యారీని తాము ప్రోత్స‌హిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు కేటీఆర్. ప్ర‌పంచ స్థాయిలో పోటీ ప‌డేలా మౌలిక వ‌స‌తుల‌ను, స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేకంగా త‌యారీదారుల‌కు తాము భ‌రోసా ఇస్తున్నామ‌ని తెలిపారు.

ప్ర‌పంచ మార్కెట్ లో బొమ్మ‌ల త‌యారీకి , ఉత్ప‌త్తుల‌కు భారీ ఎత్తున డిమాండ్ ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్. దీనిని దృష్టిలో పెట్టుకుని త‌మ ప్ర‌భుత్వం తెలంగాణ టాయ్స్ పార్క్ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టింద‌న్నారు మంత్రి. దీని వ‌ల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువ‌త‌, స్థానిక నివాసితులు, చెక్క బొమ్మ‌ల త‌యారీ దారుల‌కు ఇది ఓ మంచి వేదిక‌గా మార‌నుంద‌న్నారు. దీని వ‌ల్ల ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని, ఉపాధికి ఊతం ఏర్ప‌డుతుంద‌న్నారు కేటీఆర్.

Also Read : Temjen Imna Along : మొక్క‌లు నాట‌డం ఉద్య‌మంగా మారాలి

Leave A Reply

Your Email Id will not be published!