TSCW Bandi Sanjay : బండిపై మహిళా కమిషన్ సీరియస్
వివరణ ఇవ్వాలని ఆదేశం
TSCW Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11. 30 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గురించి వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(TSCW Bandi Sanjay) .
ఇప్పుడు ఒక వికెట్ పడిందని మరో వికెట్ పడాల్సి ఉందని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హాట్ టాపిక్ గా మారాయి. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు.
ఈ తరుణంలో వ్యక్తిగతంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి కించ పరిచేలా , ఆమె గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటోందన్నారు.
తను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇంకా స్పందించ లేదు. ఇదిలా ఉండగా బీజేపీ బీఆర్ఎస్ పై దాడికి దిగింది. మహిళా సర్పంచ్ ను కోరిక తీర్చమని ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తే మరి మహిళా కమిషన్ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించింది.
Also Read : కేసీఆర్ ఫ్యామిలీపై కక్ష కట్టిన మోదీ