Hemant Soren : బీజేపీలో నీతిమంతులు ఎవరో చెప్పండి
ప్రత్యర్థుల పైనే దర్యాప్తు సంస్థల ప్రయోగం
Hemant Soren : కేంద్ర దర్యాప్తు సంస్థలను కేవలం బీజేపీ ప్రత్యర్థులపైనే ప్రయోగిస్తోందని ఆరోపించారు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. పోనీ బీజేపీలో నీతి మంతులు ఎవరైనా ఉన్నారా ఆ పార్టీ ప్రకటించాలని అన్నారు. కావాలని ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలను ఉపయోగిస్తోందంటూ ఆరోపించారు సీఎం.
అక్రమ మైనింగ్ కేటాయింపు లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. హేమంత్ సోరేన్ ను 9 గంటల పాటు విచారించింది. విచారణ జరిగిన ఒక రోజు తర్వాత . శక్రవారం రాంచీలో జన్ ఆక్రోశ్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు హేమంత్ సోరేన్.
ఆదివాసీ, దళిత, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది అని ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రాలలో ప్రభుత్వాలలో అవినీతి, అక్రమాలు జరగడం లేదా అని ప్రశ్నించారు హేమత్ సోరేన్(Hemant Soren). భగవాన్ బిర్సా ముండా బ్రిటీష్ వారికి తల వంచలేదు. జేఎంఎం కూడా ఎవరికీ తలవంచదన్నారు.
19వ శతాబ్దపు గిరిజన నాయకుడి వీరత్వం గురించి ప్రత్యేకంగా సీఎం ప్రస్తావించారు. దర్యాప్తు సంస్థలపై తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ కేవలం బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలపై కక్ష కట్టిన తీరు బాగా లేదన్నారు. తెలంగాణ, కేరళ, బెంగాళ్, బీహార్ , ఢిల్లీ, తమిళనాడు ప్రతి చోటా కేంద్ర దర్యాప్తు సంస్థలు అదే పనిగా జల్లెడ పడుతున్నాయంటూ ఆరోపించారు.
Also Read : ఫిరాయింపుదారులు ‘ఊసరవెల్లులు’