Bhola Shankarudu Song : వెరీ స్పెష‌ల్ ‘భోళా శంక‌రుడు’ వైర‌ల్

ఏబీసీడీ మీడియా ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకం

Bhola Shankarudu Song : ప్ర‌తి ఏటా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని అమెరికా లోని ఏబీసిడీ మీడియా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న డిజిట‌ల్ మీడియా ప్ర‌త్యేకంగా భ‌క్తి గీతాల‌ను వెలువ‌రిస్తోంది. గ‌త ఏడాది 2022 ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేసిన భోళా శంకరుడిపై విడుద‌ల చేసిన గీతం (గేయం) భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. తెలుగు వారికి ప్రాణ ప్ర‌ద‌మైన దేవుళ్లు, ఆల‌యాల విశిష్ట‌త‌, చ‌రిత్ర గురించి కూడా తెలుగుఇజం యూట్యూబ్ ఛాన‌ల్ ప‌రిచ‌యం చేస్తూ వ‌స్తోంది.

తాజాగా మ‌హా శివ‌రాత్రి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని కోట్లాది మంది శివ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా ఏబీసీడీ మీడియా భోళా శంక‌రుడు సాంగ్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం యూట్యూబ్ లో అందుబాటులోకి వ‌చ్చింది. ఆ వెంట‌నే పెద్ద ఎత్తున భ‌క్త బాంధ‌వులు ఆద‌రిస్తున్నారు. శివ స్వాములు ఈ పాట‌తో సేద‌దీరుతున్నారు. శివ రాత్రి సంద‌ర్భంగా రిలీజైన ఈ భోళా శంకరుడి పాట(Bhola Shankarudu Song) సాహిత్యంతో పాటు కాన్సెప్ట్ ను అందించారు నాగేంద్ర య‌న‌మ‌ద‌ల‌.

ఈ శివ శంకరుడి భ‌క్తి గేయానికి వీనుల విందైన సంగీతాన్ని అందించారు విజ‌య్ కురాకుల‌. సాహిత్యానికి త‌గిన‌ట్టు అత్యంత భ‌క్తి పార‌వ‌శ్యంతో ఆ శివ నాథుడిని కీర్తిస్తూ హృద్యంగా ఆలాపించారు చిత్ర‌క‌వి అలేఖ్య‌. దీనిని అందంగా ఎడిటింగ్ చేశారు ముత్యాల శ్రీ జ‌గ‌న్నాథ్. ఇక చిన్న గౌడ్ తిప్ప‌గోని సౌండ్ ఇంజ‌నీరింగ్ అందిస్తే మ్యూజిక్ ఇంఛార్జ్ యాదా గౌడ్ కోనింటి నిర్వ‌హించారు. శివ భ‌క్తులంతా భోళా శంక‌రుడి పాట‌ను(Bhola Shankarudu Song) వినండి..త‌రించండి..ఇంకెందుకు ఆల‌స్యం.

Also Read : 21 నుంచి యాద‌గిరిగుట్ట ఉత్స‌వాలు

Leave A Reply

Your Email Id will not be published!