#TeluguismCalendar : ‘తెలుగుఇజం క్యాలెండర్ -2022’ రెడీ
తెలుగు వారందరికీ ఉచితం
TeluguISM Calendar 2022 : ఏబీసీడీ మీడియా ఆధ్వర్యంలోని తెలుగుఇజం.కామ్ న్యూస్ , ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ తెలుగు భాష, సంస్కృతిని ప్రతిబింబించేలా నూతన సంవత్సరం -2022ను పురస్కరించుకొని కాలమానిని – క్యాలెండర్ (TeluguISM Calendar 2022)ను రూపొందించింది.
ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన సాహిత్య, సాంస్కృతిక, సినిమా పరంగా పేరొందిన ప్రముఖులకు సంబంధించిన రచయితలు, కవులతో కూడుకున్న క్యాలెండర్ ను తయారు చేసింది.
ఇందులో భాగంగా ఎలాంటి నయా పైసా ఖర్చు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉపయోగపడేలా , సౌకర్యవంతంగా ఉండేలా పీడీఎఫ్ ఫార్మాట్ లో అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దింది.
ఈ కాలమానినిలో నెలల వారీగా పండుగలు, తేదీలు, వారాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆయా నెలకు సంబంధించి ఒక్కొక్కరు రాసిన కొటేషన్ ను ఇందులో చేర్చింది.
ఇక జనవరి నెలలో ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ ది ఉండగా ఫిబ్రవరి నెలలో మగ్ధూం మొహియొద్దీన్ , మార్చి నెలలో అభినవ నన్నయ రాయప్రోలు సుబ్బారావు , ఏప్రిల్ నెలలో నవయుగ వైతాలికుడు కందుకూరి వీరేశలింగంను పొందుపరిచింది.
మే నెలకు గాను సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జూన్ నెలలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, జూలై నెలలో దాశరథి రంగాచార్య ను చేర్చింది.
ఆగష్టు నెలకు గాను ఆరుద్ర, సెప్టెంబర్ నెలలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, అక్టోబర్ నెలకు గాను గుంటూరు శేషేంద్ర శర్మ, నవంబర్ నెలలో ఆవంత్స సోమసుందర్ , డిసెంబర్ నెలకు గాను కొండా వెంకట రంగారెడ్డిని రూపొందించింది.
తెలుగు వారందరికీ ఉపయోగపడేలా తయారు చేసిన ఈ నూతన కాలమానిని ఉపయోగించు కోవాలని ఏబీసీడీ మీడియా కోరుతోంది.
Download : తెలుగుఇజం క్యాలెండర్ -2022