Temjen Imna Along : మొక్కలు నాటడం ఉద్యమంగా మారాలి
నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్
Temjen Imna Along : పర్యావరణం దెబ్బ తింటోంది. ప్రతి ఒక్కరు ఈ సమయంలో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు నాగాలాండ్ రాష్ట్ర పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along). ప్రస్తుతం రాష్ట్ర బీజేపీకి కూడా చీఫ్ గా ఉన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవకే అంకితమైన నేతలలో టెమ్ జెన్ ఇమ్నా ఒకరు. తాజాగా ఆయన జఖామా గ్రామాన్ని సందర్శించారు.
అక్కడ వారి జీవన విధానాన్ని దగ్గరుండి చూశారు. స్థిరమైన అభివృద్ది సాధించే దిశగా గ్రామస్థులు ప్రయాణం చేస్తున్నారని ఇది తనను ఎంతగానో ముచ్చట పడేలా చేసిందన్నారు మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్.
స్థిరమైన అభ్యాసాలను పెంపొందించడంలో జఖామా గ్రామ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు పర్యాటక, విద్యా శాఖ మంత్రి. జఖామాను సుస్థిర గ్రామంగా ప్రకటించేందుకు, ప్రజల మధ్య ఉన్నందుకు తాను ఎంతగానో సంతోషానికి లోనవుతున్నానని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరు పొందారు. ఆయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజలను కలుస్తూ వారితో మమేకం అవుతారు. ఆయన రెండో సారి రాష్ట్రంలో మంత్రిగా కొలువు తీరారు.
Also Read : Jayaprada Yogi : యోగి పాలన అద్భుతం – జయప్రద
