Temjen Imna : నెట్టింట్లో టెమ్ జెన్ ఇమ్నా వైర‌ల్

నా క‌ళ్లు చిన్న‌వి అంటూ హ‌ల్ చ‌ల్

Temjen Imna :  ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కుల‌లో కొంద‌రు మోస్ట్ పాపుల‌ర్ నాయ‌కులుగా చెలామ‌ణి అవుతున్నారు. ప్ర‌చారంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ టాప్ లో ఉండ‌గా ఆయ‌న‌తో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు హ‌ల్ చ‌ల్ చేస్తూ ఉంటారు.

కానీ వీరింద‌రి కంటే ఇదే బీజేపీకి చెందిన నాగాలాండ్ ఉన్న‌త విద్య‌, గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉన్న టెమ్ జెన్ ఇమ్నా వెరీ వెరీ స్పెష‌ల్. నెట్టింట్లో మ‌నోడికి ఎక్క‌డా లేనంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ చిన్న అంశం త‌న‌కు తోచినా దానిని పోస్ట్ చేస్తూ ఉంటారు టెమ్ జెన్ ఇమ్నా.

తాజాగా ఆయ‌న త‌న క‌ళ్ల గురించి చేసిన కామెంట్స్ నెటిజ‌న్ల మ‌న‌సు దోచుకుంది. నా క‌ళ్లు చిన్న‌విగా ఉండ‌వ‌చ్చు. కానీ నేను నా వ‌ర‌కు అంద‌రికంటే ముందు ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తానంటూ పేర్కొన్నారు మంత్రి టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna). ఆయ‌న పోస్ట్ చేసిన కొద్ది సేప‌టికే వేలాదిగా లైక్ లు, కామెంట్ల‌తో హోరెత్తి పోయింది ఆయ‌న చేసిన పోస్ట్ .

త‌న చిన్న క‌ళ్ల‌తో కూడా ఒక మైలు దూరం నుంచి కెమెరాను గుర్తించ గ‌ల‌ను అంటూ స్ప‌ష్టం చేశారు. నా క‌ళ్లు చిన్న‌విగా మీకు అనిపించ‌వ‌చ్చు.

కానీ నేను కెమెరా లెన్స్ కంటే ఎక్కువ‌గా గుర్తించ గ‌ల‌ను . ఎల్ల‌ప్పుడూ సిద్దంగా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయండి. ఫోజులు ఇవ్వండి. అలాగే మీరు చదువుతున్న‌ప్పుడు మీరు న‌వ్వ‌డం కూడా చూడ‌గ‌ల‌రు అంటూ రాసుకొచ్చాడు టెమ్ జెన్ ఇమ్నా.

Also Read : పోటీలో ఉన్నా మేమిద్ద‌రం సోద‌రులం

Leave A Reply

Your Email Id will not be published!