Terror Attack Pulwama : పుల్వామాలో ఉగ్రమూక కాల్పుల మోత
పోలీస్ అధికారి మృతి ఒకరికి గాయం
Terror Attack Pulwama : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. మరో వైపు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇదే సమయంలో ఇవాళ కేవలం గంట వ్యవధిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోషియాన్ లో కరడు గట్టిన లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాదిని కాల్చి చంపారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఉగ్రమూకలు రెచ్చి పోయాయి. ప్రతీకారంతో రగిలి పోయాయి. ఊహించని రీతిలో భారత భద్రతా దళాల క్యాంపుపై కాల్పుల మోత మోగించాయి. దీంతో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి వీర మరణం పొందారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.
నసీర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. ఈ తరుణంలో ఊపిరి పీల్చుకున్న కొద్ది సేపటికే మరిపించి దాడికి తెగబడడంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో పోలీసులపై ఉగ్రవాదులు(Terror Attack Pulwama) కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
ఈ కాల్పులకు పాల్పడడంతో అక్కడికక్కడే పోలీసు అధికారి మృతి చెందడం కొంత ఇబ్బందిగా మారింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన జవాన్ గాయపడ్డాడు. దాడిని ఎదుర్కొనేందుకు గాను అదనపు బలగాలను పంపినట్లు కాశ్మీర్ జోన్ పోలీస్ అధికారి వెల్లడించారు.
మరణించిన ఉగ్రవాది అనేక ఉగ్రవాద దాడుల్లో కీలకమైన పాత్ర పోషించాడంటూ తెలిపారు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్. ఘటనపై కేంద్ర హొం శాఖ ఆరా తీసింది.
Also Read : ప్రపంచంపై ఉగ్రవాదం పెను ప్రభావం