Jai Shankar : ప్ర‌పంచంపై ఉగ్ర‌వాదం పెను ప్ర‌భావం

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్

Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(Jai Shankar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఇటీవ‌ల పదే ప‌దే ఉగ్ర‌వాదం గురించి ఎక్క‌డికి వెళ్లినా హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. యావ‌త్ ప్ర‌పంచానికి టెర్ర‌రిజం పెను ముప్పుగా మారింద‌న్నారు. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఉగ్ర‌వాదంపై ప్రపంచానికి మెరుగైన అవ‌గాహ‌న ఉంద‌న్నారు.

జై శంక‌ర్ మీడియాతో మాట్లాడారు. ఆయ‌న పాకిస్తాన్ ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ఆర్థిక‌, రాజ‌కీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది దాయాది దేశం. ప్ర‌తిసారి భార‌త్ తో గిల్లిక‌జ్జాలు పెట్టుకోవాల‌ని చూస్తోంద‌న్నారు.

ఉగ్ర‌వాదానికి పాకిస్తాన్ పెట్టింది పేర‌ని ప్ర‌స్తుతం అన్ని అవ‌ల‌క్ష‌ణాల‌ను ఆ దేశం క‌లిగి ఉంద‌న్నారు. కానీ భార‌త దేశం మొద‌టి నుంచి శాంతిని కోరుకుంటోంద‌ని స్ప‌ష్టం చేశారు జై శంక‌ర్(Jai Shankar). టెక్నాల‌జీ ప‌రంగా ఎంత ఉప‌యోగం ఉందో అంత ప్ర‌మాదం ఉంద‌న్నారు. కానీ పాకిస్తాన్ ఏనాడూ దీని గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతూ దేశంలో అల్ల‌క‌ల్లోలాల‌కు కార‌ణంగా మారిన పాకిస్తాన్ మూక‌ల్ని, దాంతో పాటు వ‌త్తాసు ప‌లుకుతూ కాశ్మీర్ అంశాన్ని రెచ్చ‌గొడుతూ రాద్దాంతం చేస్తున్న పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి చెందిన అన్ని సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు జై శంక‌ర్.

ఇప్పుడు ఉగ్ర‌వాదంపై ప్ర‌పంచానికి మునుప‌టి కంటే మెరుగైన అవ‌గాహ‌న ఉంద‌న్నారు. ప్ర‌పంచం ఇక‌పై దానిని స‌హించ‌ద‌న్నారు. తీవ్ర‌వాదాన్ని ఉప‌యోగిస్తున్న దేశాలు ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి జై శంక‌ర్.

Also Read : పుల్వామాలో ఉగ్ర‌మూక కాల్పుల మోత‌

Leave A Reply

Your Email Id will not be published!