Amit Shah : జ‌మ్మూ కాశ్మీర్ లో త‌గ్గిన తీవ్ర‌వాదం – షా

పెద్ద ఎత్తున త‌గ్గిన టెర్ర‌రిస్ట్ కేసులు

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా తాము అధికారంలోకి వ‌చ్చిన ఎనిమిదేళ్ల కాలంలో ఉగ్ర‌వాదాన్ని మ‌ట్టు బెట్ట‌డంపై ఎక్క‌వ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు. తీవ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన చ‌ర్య‌లు మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌మ‌న్నారు అమిత్ షా.

స్థానిక టెర్ర‌రిస్టుల సంఖ్య 60కి పైగా ఇటీవ‌ల ఖ‌తం చేసిన‌ట్లు డేటా వెల్ల‌డైంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల జాబితాను కేంద్ర హోం శాఖ మంత్రికి అంద‌జేశారు. సెప్టెంబ‌ర్ 30, 2022 వ‌ర‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు 47 మందిని మ‌ట్టుబెట్టారు. ఇందులో ఎక్కువ‌గా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్ర‌వాదులు ఉన్నారు.

75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో మొత్తం జ‌మ్మూ కాశ్మీర్ శాంతిలో అశాంతి చోటు చేసుకుంది. మోదీ(PM Modi) నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌జ‌ల సామాజిక , ఆర్థిక సాధికార‌త‌పై దృష్టి సారించింది. గ‌త మూడు ద‌శాబ్దాలుగా జ‌మ్మూ, కాశ్మీర్ లో హింస‌, అమాయ‌కుల హ‌త్య‌లు కొన‌సాగుతూ వ‌చ్చాయి.

జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు, భ‌ద్ర‌తా సంస్థ‌ల నుండి సేక‌రించిన డేటాను శ్రీ‌న‌గ‌ర్ లో జ‌రిగిన భ‌ద్ర‌తా స‌మీక్షా స‌మావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రితో పాటు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ,భ‌ద్ర‌తా ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. విదేశీ టెర్ర‌రిస్టుల‌తో మొత్తం స్థానిక ఉగ్ర‌వాదుల సంఖ్య ఆల్ టైమ్ క‌నిస్ట స్థాయి 60కి చేరుకుంది.

రోజు రోజుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాల దాడుల దెబ్బ‌కు టెర్ర‌రిస్టుల విధ్వంస‌క కార్య‌క‌లాపాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. 2018లో 417 మంది నుండి ఈ ఏడాది 110కి తగ్గ‌డం విశేషం.

Also Read : గ‌న్ మ్యాన్ కాల్పుల మోత‌..కాల్చివేత‌

Leave A Reply

Your Email Id will not be published!