Amit Shah : టెర్రరిస్టులకు అంత సీన్ లేదు – షా
రాళ్ల దాడికి ముందుకు రావడం లేదు
Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) షాకింగ్ కామెంట్స్ చేశారు. టెర్రరిస్టులకు అంత సీన్ లేదన్నారు. మూడు రోజుల పర్యటనలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో. ఆయన పర్యటించే కంటే ముందు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భారత్ ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడుల్లో ఉన్నతాధికారి మృతి చెందగా ఆర్మీ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అమిత్ షా టూర్ పై ఉత్కంఠ నెలకొన్నా చివరకు తన టూర్ కొనసాగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు కేంద్ర హొం శాఖ మంత్రి. ఒకప్పుడు దాడులు విస్తృతంగా జరిగేవని కానీ ఇప్పుడు రాళ్ల దాడులు చేసేందుకు జంకుతున్నారని అన్నారు.
ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే ఉగ్రవాదం కారణంగా కనీసం 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు అమిత్ షా(Amit Shah). ఉగ్రవాదం, అవినీతిని అంతం చేసి సర్వతోముఖాభివృద్దిని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలను దేశంలోనే నంబర్ వన్ గా మారుస్తామని స్పష్టం చేశారు.
టెర్రరిజం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నామని, పరిస్థితిపై భద్రతా బలగాల పూర్తి నియంత్రణను నిర్దారిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాద ఘటనలు 56 శాతం తగ్గాయని, భద్రతా బలగాల మరణాలు 84 శాతం తగ్గాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
Also Read : ఆర్ఎస్ఎస్ కామెంట్స్ పై యాత్ర ఎఫెక్ట్
