TG Govt : మూసి రివర్ డెవలప్మెంట్ పై పార్లమెంట్ లో ప్రస్తావించిన తెలంగాణ సర్కార్
TG Govt : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పై పార్లమెంటులో ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో, తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు లక్ష్యాలను వివరించింది. రాష్ట్రం తెలిపినట్లుగా, ఈ ప్రాజెక్టు మూసీ నది పునర్జీవనం కోసం మాత్రమే చేపట్టబడినది. ప్రాజెక్టు దశల్లో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగే అవకాశం లేదని, ప్రజలను నిరాశ్రయులు చేయకుండా, అవసరమైన స్థలాలలోనే తొలగింపులు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
TG Govt…
ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ జరగనుంది, కాగా భూములు కోల్పోయే కుటుంబాలకు సంబంధించి చట్టబద్ధంగా పరిష్కారాలను తీసుకురావాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, 15,000 ఇళ్లను పునరావాసం కోసం కేటాయిస్తామని కూడా తెలిపింది. నదీ పునర్జీవన, కాలుష్య నివారణ, వరదలకు నివారణ అనే ముఖ్య ఉద్దేశ్యాలతో మూసీ రివర్(Musi River) ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టబడిందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.
ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో ప్రశ్నలు పెడుతూ, ప్రాజెక్టుపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనలు ప్రస్తావించారు. ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు కోసం మూసీ రివర్(Musi River) ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MRFDCL) ఏర్పాట్లు చేస్తోంది. ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక మరియు శాశ్వత నిర్మాణాలను తొలగించే కార్యాచరణను త్వరలోనే చేపడతారని తెలుస్తోంది. తొలగింపుల వల్ల ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత కుటుంబాల జాబితాను కొద్దిరోజుల్లో వెల్లడించనున్నారు.
ప్రాజెక్టు కార్యాచరణను రెండో దశలో, 50 మీటర్ల బఫర్ జోన్ పరిధి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం ప్రాజెక్టు డీపీఆర్ ను ఒకే ప్రాజెక్టుగా రూపొందించినప్పటికీ, పనులను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదటి దశలో మూసీ నది గర్భం మరియు చుట్టుపక్కల కట్టలు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు, రెండో దశలో బఫర్ జోన్ పరిధి అభివృద్ధి చేయబడుతుంది.
మూసీ నది గర్భంలో ఇప్పటికీ 1600 ఇళ్లు ఉన్నాయని, వీటిలో చాలామందిని ఇప్పటికే తరలించారని, 13,000 మంది వరకు ఇళ్లు కోల్పోతారని అంచనా వేయబడింది. ప్రాజెక్టు ప్రారంభానికి ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరిగాయి.
ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏడాదిన్నర సమయం పడే అవకాశం ఉండగా, మొత్తం ప్రాజెక్టు ఆరేళ్లలో పూర్తయేలా కార్యాచరణను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నది పునరుజ్జీవనం కోసం మొదటి దశలో రిటెయినింగ్ వాల్ నిర్మించటం, నది నీటిని శుద్ధి చేయడం, ఆ మార్గంలో కట్టలు సుందరీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బఫర్ జోన్ పరిధిలో 55 కిలోమీటర్ల రహదారులు నిర్మించి, ఆ రహదారుల పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.
Also Read : Minister Kandula Durgesh : సాస్కి పథకం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి 113కిట్లు విడుదల చేసిన కేంద్రం