PM Modi Thanks : మద్ధతు ఇచ్చినందుకు థ్యాంక్స్ – మోదీ
అమెరికా..ఫ్రాన్స్..యుకె..దేశాలకు కృతజ్ఞతలు
PM Modi Thanks : 19 దేశాలతో కూడిన జీ20 గ్రూప్ కు నాయకత్వం వహించేందుకు భారత దేశానికి అవకాశం ఇచ్చి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Thanks). ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో జి20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జీ20కి డిసెంబర్ 1 నుంచి భారత దేశానికి అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇందులో భాగంగా తమ దేశానికి, తనకు మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. ప్రధానంగా అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ , ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ , యుకె పీఎం రిషి సునక్ , ఇండోనేషియా, తదితర దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జీ20 ప్రెసిడెన్సీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదులు తెలిపారు.
జపాన్ ప్రధాని పుమియో కిషిడా ప్రత్యేకించి తనను అభినందనించినందుకు కృతజ్ఞతలు(PM Modi Thanks) తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకు సంబంధించి సోమవారం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియ చేశారు. మీ అందరి ఆదరాభిమానాలతో పాటు సంపూర్ణ మద్ధతు ప్రకటించినందుకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా వాతావరణం, శక్తి, ఆహార సంక్షోభం వంటి భాగస్వామ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా, భారత్ కలిసి పని చేస్తాయని జో బైడెన్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా భారత దేశం ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ముద్ర కనబరుస్తోందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. ఇదే సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనే సత్తా తమకు ఉందన్నారు. అందుకే జీ20 గ్రూప్ కు నాయకత్వం దక్కిందన్నారు నరేంద్ర మోదీ.
Also Read : తల్లి ఆశీర్వాదం తనయుడి ఆనందం