Supreme Court : కొలీజియంపై నోరు జారొద్దు – సుప్రీంకోర్టు
కేంద్రం నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court : కొలీజియం వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నది. ప్రస్తుతం కేంద్ర సర్కార్ కు సుప్రీంకోర్టుకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇందులో భాగంగా గత కొంత కాలం నుంచి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో కొలీజియం వ్యవస్థ ఎక్కడా లేదన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. కొలీజియంకు వ్యతిరేకంగా కామెంట్లు చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. చట్టాన్ని అమలు చేయడమే తమ పని అని, అనవసరంగా కామెంట్స్ చేయొద్దంటూ పేర్కొంది.
జడ్జీల నియామక ప్రక్రియను సుదీర్ఘంగా కొనసాగించడం , ఎంపిక చేయక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం పట్ల సీరియస్ అయ్యింది. ఇప్పటికే కొలీజియం ద్వారా సిఫారసు చేసిన న్యాయమూర్తుల పేర్లను ఎంపిక చేయడంలో ఆలస్యం చేయడం మంచి పద్దతి కాదని పేర్కొంది సుప్రీంకోర్టు.
చట్టం ద్వారానే కొలీజియం వ్యవస్థ ఏర్పడిందని ఆ విషయాన్ని తెలుసుకోకుండా కామెంట్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించింది ధర్మాసనం. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఏ చట్టమైనా రూపొందుతుందని, కొలీజియం కూడా అందులో భాగమేనని స్పష్టం చేసింది. విషయం తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని నిలదీసింది.
ఈ అంశంపై కేంద్రంలోని పెద్దలకు సలహాలు లేదా సూచనలు లేదా అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని ఏజీ వెంకట రమణికి సూచించింది కోర్టు.
Also Read : ప్రజా తీర్పుకు సలాం హామీలు నెరవేరుస్తాం