Sri Ramanujacharya : అష్టాక్షరీ మహా మంత్రం స్మరణీయం
రామానుజుడి తిరుమంత్రం
Sri Ramanujacharya : వెయ్యేళ్లు దాటినా ఇంకా మనం స్మరించుకుంటూనే ఉన్నాం భగవద్ రామానాజాచార్యుడిని. ఆయనను భగవత్ భక్తులంతా సమతామూర్తిగా పిలుచుకుంటారు.
రామానుజుడు పఠించిన మంత్రమే అష్టాక్షరీ మంత్రం. దానినే తిరుమంత్రం అంటారు. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరంటూ కొందరిని దూరం పెడుతూ మరికొందరిని ఆలయాల్లోకి రానీయకుండా చేయడాన్ని తప్పు పట్టారు రామానుజుడు.
దైవాన్ని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని వేరే వారికి తెలియ కూడదనే కట్టుబాటు, నిబంధన, వివక్షను తీవ్రంగా ఖండించారు, నిరసించారు రామానుజుడు. ఆనాటి కట్టుబాట్లపై యుద్దం ప్రకటించాడు.
ఆ కాలంలో మిగిలిన వారంతా భగవంతుడిని చేరుకునేందుకు నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్వాలేదంటూ ప్రకటించిన ధీశాలి ఈ సమతామూర్తి.
సకల కట్టుబాట్లను దాటుకుని మానవులందరినీ దైవం వద్దకు చేర్చే అష్టాక్షరీ మహా మంత్రాన్ని బహిరంగంగా గోపురం ఎక్కి అందరికీ చెప్పిన మహానుభావుడు రామానుజుడు(Sri Ramanujacharya).
ఆనాటి ఆయన స్పూర్తిని ప్రతి ఒక్కరికీ చేర్చాలనే సత్ సంకల్పంతో ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో 216 అడుగులతో రామానుజుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఇందు కోసం ఏకంగా రూ. 1000 కోట్లు ఖర్చు చేశారు. దాతలు, భక్తులు ఇచ్చిన విరాళాలతో దీనిని నిర్మించారు. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ దీనిని తయారు చేసింది.
ఇందులో 60 మంది నిపుణులు పాల్గొన్నారు. ఆనాటి తిరుమంత్రాన్ని కోట్లాది భక్తులకు చేర వేయడంలో భాగంగానే సమతా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి(Sri Ramanujacharya).
Also Read : సమతామూర్తి ఉత్సవం ప్రారంభం