HYD Police Arrest : బీజేపీ..ఆర్ఎస్ఎస్ నేతల హత్య కుట్ర భగ్నం
హైదరాబాద్ లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
HYD Police Arrest : హైదరాబాద్ పోలీసులు ముందస్తు ఉగ్రదాడులను ఛేదించారు. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇందుకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్(HYD Police Arrest) చేశారు. అరెస్ట్ అయిన వీరు భాగ్యనగరంలో ఉగ్ర దాడులు చేసేందుకు పథకం వేశారని ఆరోపించారు.
వారి వద్ద నుంచి నాలుగు నాటు బాంబులు రూ. 5,41,800 నగదుతో పాటు ఐదు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు నగరంలో మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరినంతా తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టారు.
ఇళ్ల వద్ద నుంచి తీసుకెళ్లారు. సిట్ వీరిపై విచారణ చేపట్టింది. విశ్వసనీయ సమాచారం మేరక స్పెషల్ పోలీస్ టీం హైదరాబాద్ లోని ముసారాంబాగ్ , మలక్ పేట కు చెందిన అబ్దుల్ జాహెద్ , అక్బర్ బాగ్ కు చెందిన సమీరుద్దీన్ , మెహదీపట్నంకు హుమాయున్ నగర్ కు చచెందిన మాజ్ హసన్ ఫరూక్ లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
వీరు బహిరంగ సభలను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రెనేడ్ లను విసిరి నగరంలో తీవ్ర భయాందోళనలను, మతపరమైన ఉద్రిక్తలు చెలరేగేలా ప్లాన్ చేశారు. వీరి రహస్య కార్యకలాపాల గురించి కచ్చితమైన సమాచారం సేకరించారు.
గతంలో హైదరాబాద్ లో పలు ఉగ్రదాడి కేసుల్లో చిక్కుకున్న నగరంలోని మలక్ పేట్ కు చెందిన అబ్దుల్ జాహెద్ కు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ తో పరిచయాలు ఉన్నాయి.
బేగంపేట పై జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించిన కేసులో ఇతడి ప్రమేయం ఉంది. హైదరాబాద్ కు చెందిన ఫర్హతుల్లా ఘోరి, సిద్దిక్ బిన్ ఉస్మాన్ , అబ్దుల్ మజీద్ లు అనేక ఉగ్రవాద కేసుల్లో వాంటెడ్ గా ఉన్నారు. పాకిస్తాన్ లో స్థిరపడ్డారు.
Also Read : పుల్వామాలో ఉగ్రమూక కాల్పుల మోత