Maulana Shahabuddin Rizvi : పాపులర్ ఫ్రంట్ పై నిషేధం సబబే
ఆలిండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్
Maulana Shahabuddin Rizvi : కేరళలో ప్రారంభమై దేశమంతటా విస్తరించి అల్లకల్లోలాకు, విద్వేషాలకు, ఉగ్రవాదులకు అడ్డగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం కొరడా ఝులిపించింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలన్నింటిపై దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించడాన్ని దేశంలోని ముస్లిం మత సంస్థలు, పెద్దలు స్వాగతించారు. ముందు దేశం ముఖ్యమని ఆ తర్వాతే సంస్థలు ఉండాలన్నారు.
దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఏ సంస్థ అయినా, లేదా ఏ వ్యక్తులైనా తాము మద్దతు ఇవ్వబోమంటూ స్పష్టం చేశారు. దీనిపై సీరియస్ గా మొదటి నుంచీ స్పందిస్తూ వస్తున్నారు ఆల్ ఇండియా ముస్లిం జామాత్ చీఫ్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ(Maulana Shahabuddin Rizvi). ఆయన తాజాగా వీడియో ద్వారా సందేశం వినిపించారు.
మహ్మద్ ప్రవక్త ఏనాడూ హింసను కోరుకోలేదన్నారు. దేశంలో తీవ్రవాదన్ని అరికట్టేందుకు ఇలాంటి చర్యలు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు బరేల్వీ. ఉగ్రవాద కార్యకలాపాలపై నిషేధం విధించాలనే కేంద్రం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు సూఫీ, బరేల్వీ మత పెద్దలు బుధవారం సంయుక్తంగా కీలక ప్రకటన చేశారు.
అంతే కాకుండా ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని అరికట్టాలనే లక్ష్యంతో చర్య తీసుకుంటే ప్రతి ఒక్కరూ సహనం ప్రదర్శించాలని సూచించింది. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశమంతటా జల్లెడ పడుతున్నాయి. దాడులు చేస్తున్నాయి.
Also Read : లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ అరెస్ట్