Meghalaya BJP Wants : మేఘాలయ కేబినెట్ లో చేర్చుకోండి
సీఎం కొన్రాడ్ సంగ్మాను కోరిన బీజేపీ
Meghalaya BJP Wants : ప్రమాణ స్వీకారం చేయకముందే కొత్త తలనొప్పులు మొదలయ్యాయి ఎన్పీపీ చీఫ్ , మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా. తాజాగా రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. మొత్తం 60 సీట్లకు గాను ఒకరు చని పోవడంతో 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఏకైక పార్టీగా 26 సీట్లు సాధించి ఎన్పీపీ నిలిచింది. ఎన్నికల కంటే ముందు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ఎన్పీపీ, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. కానీ బీజేపీకి 2 సీట్లు మాత్రమే దక్కాయి.
ఇక టీఎంసీ పార్టీకి 5 సీట్లు , కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు దక్కాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఎన్పీపీ మిత్రపక్ష పార్టీ 11 సీట్లు గెలుపొందాయి. ఇప్పటికే సీఎం తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ చౌహాన్ ను కలిసి విన్నవించారు. ఈ మేరకు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పీఎం మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు సీఎం కొన్రాడ్ సంగ్మా. ఇదిలా ఉండగా ట్రబుల్ షూటర్ ను కలిశారు.
అనంతరం మేఘాలకు(Meghalaya BJP Wants) సంబంధించి రాష్ట్ర కొత్త మంత్రివర్గంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కూడా చోటు కల్పించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ డిమాండ్ చేశారు. మార్చి 7న కాన్రాడ్ సంగ్మా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ఎన్పీపీకి మద్దతు ప్రకటించింది. షిల్లాంగ్ లోని రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం జరగనుంది. పీఎం మోదీ హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన సీఎం సంగ్మాను ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : ప్రహసనంగా మారిన ఎన్నికలు – సర్కార్