PM Modi : కాళీ దేవి ఆశీస్సులు దేశానికి ఉన్నాయి

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi : కాళీ దేవి పోస్ట‌ర్ పై వివాదం చెల‌రేగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కాళీ దేవి ఆశీస్సులు భార‌త దేశానికి ఎల్ల‌ప్ప‌టికీ ఉంటాయ‌ని అన్నారు.

ఒక ర‌కంగా టీఎంసీకి ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు ఈ సంద‌ర్భంగా. స్వామి ఆత్మాస్థానానంద శ‌త జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ(PM Modi) ప్ర‌సంగించారు.

రామ‌కృష్ణ మ‌ఠానికి 15వ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన స్వామి ఆత్మాస్థానానంద చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. ఇదే స‌మ‌యంలో టీఎంసీ ఎంపీ కాళీ దేవిని ఉద్దేశించిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి.

బీజేపీ దీనిని త‌ప్పు ప‌ట్టింది. ఆపై పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎంపీ మ‌హూవా మోయిత్రాపై కేసు న‌మోదైంది. మోయిత్రాను వెంట‌నే పార్టీ నుండి స‌స్పెండ్ చేయాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇదే స‌మ‌యంలో ఆమెకు చెందిన పార్టీ టీఎంసీ సైతం తీవ్ర వ‌త్తిళ్లు, వ్య‌తిరేక‌త ఎదురు కావ‌డంతో మ‌హూవా మోయిత్రాకి గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ పార్టీకి ఎంపీ చేసిన వ్యాఖ్య‌లతో సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

దీంతో మ‌హూవా మోయిత్రా ట్విట్ట‌ర్ లో త‌న పార్టీని అన్ ఫాలో చేసింది. ఇదే స‌మ‌యంలోనే టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జ‌లు అన్నాక త‌ప్పులు చేస్తారు. మాట్లాడ‌తారు. ఆ త‌ర్వాత స‌రిదిద్దుకుంటార‌ని పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ ఎంపీ మ‌హూవా మోయిత్రాకు అండ‌గా నిలిచారు.

Also Read : ప్ర‌జ‌లే ప్ర‌భువులు పాల‌కులు సేవ‌కులు

Leave A Reply

Your Email Id will not be published!