ED Raids : క్యాసినో వ్యవహారం ఈడీ దాడుల కలకలం
చీకోటి ప్రవీణ్..మాధవ రెడ్డి ఇళ్లపై దాడులు
ED Raids : తీగ లాగితే డొంకంతా కదిలినట్టు క్యాసినో వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూసేలా చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విస్తృతంగా బుధవారం దాడులకు దిగింది.
నగరంలోని ఎనిమిది చోట్ల విస్తృతంగా సోదాలు చేపట్టింది. క్యాసినో నిర్వాహకులుగా ఉన్న చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డి కింది ఇళ్లు, ఆఫీసులను జల్లెడ పడుతున్నారు.
వీరిద్దరూ విదేశాలకు దొడ్డి దారిన హవాలా రూపంలో నిధులు మళ్లించినట్లు ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఐఎస్ సదన్ లో ఉన్న చీకోటి ప్రవీన్ , బోయిన్ పల్లి లోని మాధవరెడ్డి ఇళ్లలో దాడికి దిగింది.
ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ , ఆంధ్రాతో పాటు నేపాల్ , శ్రీలంకలో కూడా వీరు క్యాసినో నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు ఈడీ(ED Raids) అధికారులు.
ఇదిలా ఉండగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి పేకాట రాయుళ్లను స్పెషల్ ఫ్లైట్స్ లలో తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేపాల్ కు తరలిస్తున్నట్లు పసిగట్టింది. అక్కడ క్యాసినో పేరుతో ఈవెంట్లు కూడా నిర్వహించినట్లు వెల్లడైంది.
భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసే వారిని , ఆటకు తగ్గట్టు విందు, డ్యాన్సులు కూడా ఏర్పాటు చేసినట్లు తేలింది. ఇందులో టాలీవుడ్ కి చెందిన వారిని ఆడించినట్లు అనుమానం.
ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ. 3 లక్షలు వసూలు చేశారు. నేపాల్ , శ్రీలంక, ఇండోనేషియాలలో ఈవెంట్ లు ప్లాన్ చేసినట్లు గుర్తించింది ఈడీ.
Also Read : మనీలాండరింగ్ అరెస్టులు ఏకపక్షం కాదు