Sanjay Raut : కేంద్ర సర్కార్ పై సంచలన కామెంట్స్ చేశారు మరోసారి శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut ). ఇప్పటి వరకు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది కేంద్రం వర్సెస్ మహారాష్ట్ర సర్కార్ మధ్య. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు. ముంబైలో మరాఠీ మాట్లాడే వారి శాతం తగ్గుతోందన్నారు.
అందుకే నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఈ బృందం కోర్టును ఆశ్రయించ వచ్చని సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ మొత్తం కుట్రకు బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య నాయకత్వం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీకి చెందిన నేతలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల బృందం ఈ కుట్రలో భాగమేనని సంజయ్ రౌత్ (Sanjay Raut )నిప్పులు చెరిగారు.
ముంబైని కేంద్ర సర్కార్ పాలించే నగరంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా చోటు చేసుకుంటున్న ఆందోళనలు, నిరసనలకు ముంబైకి చెందిన ఒక పెద్ద బిల్డర్ , వారణాసికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారంటూ మండిపడ్డారు.
మొత్తం కుట్రంతా సోమయ్య నేతృత్వంలో జరుగుతోందంటూ ఆరోపించారు. పాఠశాలలో మరాఠీని తప్పనిసరి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సోమయ్య గతంలో సవాల్ చేశారని గుర్తు చేశారు.
యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను కూల్చి వేయకుండా రక్షించేందుకు సేకరించిన నిధుల పేరుతో మాజీ లోక్ సభ ఎంపీ డబ్బును స్వాహా చేశారంటూ ఆరోపించారు సంజయ్ రౌత్.
Also Read : శివసేన లీడర్ జాదవ్ ఆస్తులు జప్తు