Navjyot Singh Sidhu : రాహుల్ గాంధీ ఈ దేశానికి అవ‌స‌రం

ప్ర‌శంస‌లు కురిపించిన న‌వ్ జ్యోత్ సిద్దూ

Navjyot Singh Sidhu : పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్, మాజీ క్రికెట‌ర్ , ప్ర‌ముఖ ప్ర‌యోక్త న‌వ్ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీకి చెందిన ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేశాడు. ఆరు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాహుల్ గాంధీ అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌లు వేదిక‌ల‌పై త‌న విజ‌న్ గురించి స్ప‌ష్టంగా చెప్పారు. అమెరికా మీడియా ఎన్ని ప్ర‌శ్న‌లు వేసినా , ఇబ్బందులకు గురి చేసినా ఎక్క‌డా తొట్రు ప‌డ‌కుండా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

రాహుల్ గాంధీ త‌న విజ‌న్ ఏమిటో , దేశానికి ఏం కావాల‌నే దానిపై స్ప‌ష్టత ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం మోదీ మేనియాలో ప‌డిన ఇత‌ర దేశాల‌కు ప్ర‌త్యేకించి అమెరికాకు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఆయ‌న తాను ప‌ప్పు కాద‌ని ఫైర్ అని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మొద‌టిసారిగా న‌వ్ జ్యోత్ సింగ్ సిద్దూ.

చ‌ద‌రంగంలో లాగే జీవితంలోనూ ముందు చూపు గెలుస్తుంద‌న్నారు. దార్శ‌నిక‌త‌ను క‌లిగి ఉంటే స‌మ‌స్య‌లు చిన్న‌విగా అనిపిస్తాయ‌ని అన్నారు సిద్దూ. రాహుల్ గాంధీ విజ‌న‌రీ క‌లిగిన అరుదైన నాయ‌కుడ‌ని కొనియాడారు. ఆయ‌న ప‌రిష్కారాలు రాబోయే త‌రాల‌కు ప్రోత్సాహ‌క‌రంగా ఉంటాయ‌ని, ప్రేర‌ణ‌గా నిలుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు పీసీసీ మాజీ చీఫ్ సిద్దూ.

ఇవాళ కేంద్రంలోని మోదీ స‌ర్కార్ అత్యున్న‌త వ‌ర్గాల‌కు లబ్ది చేకూర్చేలా చేసింద‌న్నారు. రాహుల్ గాంధీ అణ‌గారిన‌, పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల , చిన్న వ్యాపారులు, రైతుల గురించి ఆలోచిస్తున్నార‌ని ఇవాళ కాక పోయినా రేప‌టి రోజైనా రాహుల్ గాంధీ నాయ‌క‌త్వం ఈ దేశాకిని అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు సిద్దూ.

Also Read : KTR KCR : మాదే రాజ్యం మ‌ళ్లీ కేసీఆరే సీఎం

Leave A Reply

Your Email Id will not be published!