Rahul Gandhi : దేశానికి మానవత్వమనే మతం కావాలి
పిలుపునిచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత
Rahul Gandhi : ఈ దేశానికి కావాల్సింది మతం కాదు మానవత్వం కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలని కోరారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 రాష్ట్రాలలో పూర్తి చేశారు.
ఆయన గత ఏడాది 2022లో తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి తన యాత్రను ప్రారంభించారు. మొదట్లో లైట్ గా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత దాని అనుబంధ సంస్థలు, నాయకులు, ప్రతినిధులు సైతం రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆపై వ్యక్తిగత విమర్శలు చేశారు.
కానీ ఆ తర్వాత విమర్శించడం మానేశారు. ఆయన ఎక్కడా ఎవరినీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు. కానీ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ఎక్కువగా ప్రస్తావించారు. అంతే కాకుండా దేశ రాజధాని ఢిల్లీ రెడ్ ఫోర్డ్ వేదికగా జరిగిన సభలో ఏకంగా అదానీ, అంబానీని టార్గెట్ చేశారు.
దేశంలో అన్నీ అమ్ముకుంటూ పోతే ఏం మిగులుతుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). అంతే కాదు తమ హయాంలో కాపాడుకుంటూ వచ్చిన ప్రజల ఆస్తులను గంప గుత్తగా ఆసాములకు అమ్ముకుంటే ఎలా అని నిలదీశారు. చివరకు పీల్చే గాలిని, తాజ్ మహల్ ను కూడా అమ్మేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో తనను పప్పు అని విమర్శించిన వాళ్లకు ఆయన సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు తాను పప్పు కాదని ఫ్లవర్ అంతకన్నా కాదని ఫైర్ అని నిరూపించుకున్నారు రాహుల్ గాంధీ.
Also Read : రాహుల్ తో జతకట్టిన ‘రా’ మాజీ చీఫ్