Nupur Sharma : నూపుర్ శ‌ర్మ‌పై కోర్టు వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రం

మాజీ న్యాయ‌మూర్తుల‌, అనుభ‌వ‌జ్ఞుల లేఖ

Nupur Sharma : ప్ర‌వ‌క్త మ‌హ్మ‌ద్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నూపుర్ శ‌ర్మ త‌న‌పై న‌మోదైన అన్ని కేసుల‌ను ఢిల్లీకి బ‌దిలీ చేయాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఈ సంద‌ర్భంగా దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను విచారించింది జ‌స్టిస్ సూర్య‌కాంత్ , జ‌స్టిస్ పార్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం. ఈ మేర‌కు దావాను తిర‌స్క‌రిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న్యాయ‌మూర్తులు.

దేశానికి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆదేశంచారు. అంతే కాదు నోరు అదుపులో పెట్టుకోక పోవ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని మండిప‌డ్డారు.

ఆపై ఉద‌య్ పూర్ లో టైల‌ర్ హ‌త్య నీవు చేసిన కామెంట్స్ వ‌ల్లే జ‌రిగిందంటూ స్ప‌ష్టం చేశారు.

దీంతో తీర్పు చెప్పిన న్యాయ‌మ‌ర్తులు ఎవ‌రో అంటూ దేశంలో చాలా మంది వెతికారు. అయితే ఉన్న‌ట్టుండి ఇవాళ మాజీ న్యాయ‌మూర్తులు, మేధావులు ఓ సుదీర్ఘ‌మైన లేఖ రాశారు.

నూపుర్ శ‌ర్మ(Nupur Sharma) పై చేసిన కామెంట్స్ అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని, రాజ్యాంగ ప‌రిధిలో లేవ‌ని పేర్కొన్నారు. ఇది పూర్తిగా న్యాయ శాఖ

లైన్ త‌ప్పిన‌ట్టుగా అనిపిస్తోంద‌ని వాపోయారు. ఆ వ్యాఖ్య‌లు న్యాయ ధ‌ర్మానికి త‌గిన‌ట్టుగా లేవ‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

15 మంది మాజీ న్యాయ‌మూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 25 మంది సాయుధ ద‌ళాల రిటైర్డ్ అధికారులు ఈ లేఖ‌లో సంత‌కాలు చేశారు. బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.

ఇటువంటి దారుణ‌మైన అతిక్ర‌మ‌ణ‌లు న్యాయ వ్య‌వ‌స్థ చ‌రిత్ర‌లో స‌మాంతంర‌గా లేవ‌న్నారు. సంత‌కం చేసిన 117 మందిలో బాంబే హైకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి క్షితిజ్ వ్యాస్ , గుజ‌రాత్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి ఎస్ఎం సోనీ, రాజ‌స్థాన్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తులు ఆర్ఎస్ రాథోడ్ ,

ప్ర‌శాంత్ అగ‌ర్వాల్ , ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి ఎస్ఎన్ థింగ్రా ఉన్నారు.

మాజీ ఐఏఎస్ అధికారులు ఆర్ఎస్ గోపాల‌న్ , ఎస్. కృష్ణ కుమార్ , మాజీ పోలీస్ అధికారులు వైద్ , డోగ్రా , ఎల్జీ వీకే చ‌తుర్వేది, ఎయిర్ మార్ష‌ల్ మాజీ

ఎస్పీ సింగ్ ఉన్నారు.

Also Read : జీ న్యూస్ యాంక‌ర్ రోహిత్ రంజ‌న్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!