Anurag Thakur : బహిష్కరణ సంస్కృతి ప్రమాదం – ఠాకూర్
పఠాన్ మూవీ పై నిరసనల మధ్య కామెంట్స్
Anurag Thakur : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో పాటు హిందూ సంస్థలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. అంతే కాకుండా బీజేపీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ రాష్ట్ర హొం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ తరుణంలో ఢిల్లీ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అనవసరమైన విషాయలు పట్టించు కోవద్దంటూ స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
బహిష్కరణ సంస్కృతి వాతావరణాన్ని పాడు చేస్తుందని అన్నారు. బహిష్కణ సంస్కృతిని తీవ్రంగా ఖండించారు. భారత దేశం ఒక మృధువైన శక్తిగా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్న సమయంలో ఇటువంటి సంఘటనలు వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా విషయంలో ఎవరికైనా సమస్య వస్తే సంబంధిత ప్రభుత్వ శాఖతో మాట్లాడాలని , వారు చిత్ర నిర్మాతలతో సమస్యను పరిష్కరించ గలరని పేర్కొన్నారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). భారత దేశం సాఫ్ట్ పవర్ గా తన ప్రభావాన్ని చూపుతోందన్నారు. షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొణే కలిసి నటించిన పఠాన్ లోని పాటపై అభ్యంతరం తెలిపారు.
కొన్నిసార్లు కేవలం వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొంత మంది దాని గురించి పూర్తిగా తెలుసు కోకుండానే ఏదో ఒక దానిపై వ్యాఖ్యానిస్తారు. దాని వల్ల సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
Also Read : ప్రతిపక్షాల విమర్శలు సిలబస్ లో లేవు