Statue Of Equality : వెయ్యేళ్ల కిందట భువిపై వెలసిన శ్రీ రామానుజుడు సమతామూర్తి కొలువు తీరిన సమతా కేంద్రం(Statue Of Equality )ఆధ్యాత్మికతతో అలరారుతోంది.
జగత్ గురువుగా కొలిచే శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీ భగవద్ రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నడుస్తున్నాయి శ్రీరామనగరంలో.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో వేలాది మంది భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కొలువై ఉన్న భక్తులంతా ఆ సమున్నత సమతా మూర్తిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు.
చిన్న జీయర్ మంగళా శాసనాలతో పాటు అందించే తీర్థం కోసం వేచి ఉన్నారు. ఇదొక అనిర్వచనీయమైన అనుభూతిని కలుగ చేస్తోందని అంటున్నారు భక్త బాంధవులు.
రూ. 1000 కోట్లతో 216 అడుగులతో కొలువు తీరింది సమతామూర్తి విగ్రహం. 120 కేజీల బంగారంతో తయారు చేసిన ప్రతిమ ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
నలు మూలల నుంచి తరలి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తో పాటు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమతా కేంద్రాన్ని(Statue Of Equality )సందర్శించారు.
యాగం చేసిన అనంతరం రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరించి దేశానికి అంకితం చేశారు ప్రధాని. జయ జయ రామానుజ అంటూ భక్తులు నినాదాలు చేశారు.
జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. ఇక యాగశాలలో దృష్టి దోసాల నివారణకు వైయ్యూహికేష్టి యాగాన్ని చేపట్టారు . 5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు.
Also Read : యాదాద్రి పనుల పురోగతిపై సీఎం ఆరా