Nirmala Sitharaman : ఆర్థిక సంక్షోభం శ్రీలంకకు సహకారం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి భరోసా ఇచ్చారు భారత దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman). బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
దాయాది దేశాన్ని ఆదుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నుంచి శ్రీలంక గట్టెక్కేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.
ఇప్పుడిప్పుడే ఆ దేశం మెల మెల్లగా కోలుకుంటోందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ శ్రీలంక హైకమీషనర్ మిలిందా మొరగోడాతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మిలిందా తమ దేశానికి తోచిన మేరకు సాయం చేయాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
సహకారం, సహాయంపై గత మే నెల 27న శ్రీలంక హై కమీషనర్ సీతారామన్(Niramala Sitharaman) ను కలుసుకున్నారు. ఆ తర్వాతి తిరిగి ఈనెల 22న మళ్లీ భేటీ అయ్యారు.
వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు భారత్ సహకారం అత్యంత అవసరమని నొక్కి చెప్పారు శ్రీలంక హైకమీషనర్ మిలిందా మొరగోడా.
అయితే శ్రీలంక దేశ ఆర్థిక పునరుద్దరణ ప్రక్రియకు భారత్ పూర్తి మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి శ్రీలంకలో సాగు సీజన్ ప్రారంభమైంది.
ఇందుకు సంబంధించి 65,000 టన్నుల యూరియాను దిగుమతి చేసుకునేందుకు గాను $55 మిలియన్ల ను మంజూరు చేసినందుకు భారత్ కు ధన్యవాదాలు తెలిపారు హైకమీషనర్.
Also Read : ‘ముర్ము’ ఆదివాసీ ఆణిముత్యం – సీఎం
ఇంటా గెలిచి రచ్చ గెలవాలి