Kiren Rijiju : పంజాబ్ లో జీతాలు ఇవ్వ‌లేని స‌ర్కార్

కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగిన కిరెన్ రిజిజు

Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు షాకింగ్ కామెంట్స్ చేశారు. పంజాబ్ లో కొలువు తీరిన ఆప్ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. భ‌గ‌వంత్ మాన్ ప్రభుత్వం నెల జీతాలు చెల్లించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని మ‌రి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారంటూ ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ను ప్ర‌శ్నించారు.

ఎందుకు ఇంత వ‌ర‌కు వేత‌నాలు చెల్లించ‌లేక పోయారంటూ నిల‌దీశారు. నిధుల కొర‌త‌ను ఎదుర్కొంటోంద‌ని , ఆగ‌స్టు నెల జీతాలు ఇంకా ఉద్యోగుల‌కు ఇవ్వ‌లేదంటూ ఆరోపించారు.

కేజ్రీవాల్ భార‌త దేశాన్ని ప్ర‌పంచ నెంబ‌ర్ 1గా చేయాల‌ని కోరుకుంటున్నారు. కానా ఒక ఏడాదిలో పంజాబ్ లో ఏం చేశాడో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని కోరాడు.

ఢిల్లీలో ప‌రిస్థితి ఇందుకేమీ భిన్నంగా లేద‌న్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). కాగా ఆప్ ఆధీనంలో ఉన్న ఢిల్లీలో భారీగా ఆదాయం స‌మ‌కూరుతోంద‌న్నారు.

ఢిల్లీ త‌ల‌స‌రి ఆదాయం భారత‌దేశ సగ‌టు త‌ల‌స‌రి కంటే మూడు రెట్లు ఎక్కువ‌. భారీ ఆదాయం ఉన్నా అది వృధాగా మారింద‌ని మండిప‌డ్డారు.

ఎదుటి వారిపై రాళ్లు వేయ‌డం కంటే ముందు మీ ఇళ్లు చ‌క్క‌దిద్దు కోవ‌డం చేసుకోవాలంటూ సూచించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి. ఇక‌నైనా ఢిల్లీకి వ‌స్తున్న ఆదాయంలోకి కొంత మొత్తం పంజాబ్ రాష్ట్రానికి పంపిణీ చేయాల‌ని దీని వ‌ల్ల అక్క‌డ ఇబ్బందులు తొల‌గి పోతాయ‌ని సూచించారు కిరెన్ రిజిజు.

త‌న త‌ప్పుల్ని క‌ప్పి పుచ్చుకునేందుకే ఇత‌రుల‌పై బుర‌ద చ‌ల్ల‌డం స్టార్ట్ చేశాడ‌ని మండిప‌డ్డారు కేంద్ర మంత్రి.

Also Read : 80 శాతం బ‌డులు యార్డుల కంటే అధ్వాన్నం

Leave A Reply

Your Email Id will not be published!