Iran Abolishs : మహిళల పోరాటం తలొంచిన ప్రభుత్వం
ఇరాన్ ఏజీ మొహమ్మద్ జాఫర్ మోంటజేరి
Iran Abolishs : ఇరాన్ మహిళలు అలుపెరుగని రీతిలో చేసిన పోరాటం స్పూర్తి దాయకం. దెబ్బకు సర్కార్ దిగి వచ్చింది. గత కొంత కాలం నుంచి హిజాబ్ వివాదం కోనసాగుతోంది. ప్రత్యేకించి తమపై మీ పెత్తనం ఏంటి అంటూ నిరసనలు, ఆందోనళలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరం మారనుందని సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తానే రంగంలోకి దిగారు ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంటజేరి(Iran Abolishs). ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కఠినమైన చట్టం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.
పార్లమెంట్, న్యాయ వ్యవస్థ కలిసి సుదీర్ఘంగా చర్చించనున్నట్లు స్పష్టం చేశారు. అంత వరకు ఆందోళనలు విరమించు కోవాలని సూచించారు. గత కొన్ని నెలలుగా ఇరాన్ దేశం హిజాబ్ వ్యతిరేక నినాదాలతో అట్టుడుకుతోంది. రెండు నెలల తర్వాత ఇరాన్ సర్కార్ దిగి వచ్చింది.
తన నైతికత పోలీసు విభాగాలను రద్దు చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. దేశంలోని కఠినమైన మహిళా దుస్తుల నియమావళి ఉల్లంఘించిందని ఆరోపిస్తూ మహ్సా అమీని అనే మహిళను అరెస్ట్ చేశారు.
లాకప్ లో ఆమె అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఇరాన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆమెకు నివాళులు అర్పించారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది.
ఇరాన్ లో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.
Also Read : ధిక్కార స్వరం దిగొచ్చిన ప్రభుత్వం