Sri Ramanuja : స‌మ‌తా మూర్తికి స‌మున్న‌త గౌర‌వం

216 అడుగుల భారీ విగ్ర‌హం ఏర్పాటు

Sri Ramanuja  : మ‌నుషులంతా ఒక్క‌టేన‌ని ఎన్నో ఏళ్ల కింద‌టే బోధించ‌డ‌మే కాకుండా ఆచ‌ర‌ణ‌లో చూపించిన మ‌హ‌నీయుడు రామానుజాచార్యులు(Sri Ramanuja ). ఆయ‌న ఏది చెప్పారో అదే ఆచ‌రించి చూపించారు.

అందుకే ఆయ‌న మ‌హ‌నీయుడ‌య్యారు. ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకునేలా, నేటి త‌రాలు గుర్తుంచుకునేలా ఉండేలా రూ. 1000 కోట్ల‌తో రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ ఆశ్ర‌మ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేశారు ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి.

భారీ ఎత్తున భ‌క్తులు, సంస్థ‌లు, కంపెనీలు, అభిమానులు అంద‌జేసిన విరాళాల మేర‌కు భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక టెక్నాల‌జీని దీనికి వాడారు.

120 కేజీల బంగారాన్ని కూడా వాడిన‌ట్లు స‌మాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ఇలాంటి భారీ విగ్ర‌హం ఇంకెక్క‌డా లేదు.

రామానుజాచార్యుల్ని నిత్యం స్మ‌రించుకునేలా ఉండేలా ఎల్ల‌కాలం భావి త‌రాల‌కు అందించాల‌నే స‌త్ సంక‌ల్పంతో 216 అడుగుల‌తో మూర్తిని ఏర్పాటు చేశారు.

ఈనెల 5న భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే చిన‌జీయ‌ర్ స్వామి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ఈ ఒక్క కార్య‌క్ర‌మానికి ఆరు లేన్ల ర‌హదారిని ఏర్పాటు చేశారు. దీంతో చుట్టు ప‌క్క‌ల రియ‌ల్ ఎస్టేట్ కు ఊతం వ‌చ్చేలా మారింది ఈ ప్రాంతం.

ర‌వాణా సౌక‌ర్యం కూడా దీనికి ప్ర‌ధాన అడ్వాంటేజ్. బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారితో పాటు ద‌గ్గ‌ర‌లోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా ఉంది.

14 వ‌ర‌కు జ‌రిగే కార్య‌క్ర‌మాలలో హోమ‌కుండాల‌తో యాగాన్ని కూడా నిర్వ‌హిస్తున్నారు. భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్నారు.

Also Read : ప్రాతః స్మ‌ర‌ణీయుడు రామానుజుడు

Leave A Reply

Your Email Id will not be published!