Supreme Court : హిజాబ్ వివాదం (Hijab controversy) దేశాన్ని కుదిపేసింది. ఈ అంశం ప్రపంచాన్ని ఆకర్షించింది. దీనిపై ఎవరు జోక్యం చేసుకున్నా సహించ బోమంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం (central government) హెచ్చరించింది.
కోర్టు పరిధిలో ఉన్న ఏ అంశంపైన నైనా తాము జోక్యం కల్పించుకోమని ప్రకటించింది. ఈ తరుణంలో సంచలనానికి కేరాఫ్ గా మారిన హిజాబ్ వివాదం (Hijab controversy) ఎన్నికల కంటే ముందు రగిలింది.
దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. నాలుగు రాష్ట్రాలలో కాషాయ జెండా రెప రెప లాడింది. సంచలనం రేపిన హిజాబ్ వివాదం (Hijab controversy) కర్ణాటకను కుదిపేసింది.
దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. ఈ తరుణంలో హిజాబ్ ధరించడం అన్నది ఇస్లాం మతంలో లేదని, విద్యా సంస్థల్లో ధరించడం అన్నది తప్పనిసరి కాదని కర్ణాటక సర్వోన్నత న్యాయ స్థానం ( హైకోర్టు ) స్పష్టం చేసింది.
ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఖరాఖండిగా తేల్చి చెప్పింది. విద్యా సంస్థలలో చదువుకునేందుకు వచ్చే ఏ విద్యార్థులైనా ఆయా సంస్థలు లేదా ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, రూల్స్ కు లోబడే నడుచు కోవాలని స్పష్టమైన తీర్పు చెప్పింది.
ఈ తీర్పు దేశంలో సంచలనం కలిగించింది. 200 పేజీలతో కూడిన ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును (Supreme Court ) or (Supreme Court of Karnataka) ఆశ్రయించారు.
మరో వైపు ముస్లిం విద్యార్థినులు విద్యా సంస్థలకు హాజరు కాలేదు. తాము న్యాయం కోసం పోరాడతామని బాధితులు తెలిపారు. హోళీ తర్వాత హిజాబ్ అంశంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read : మన లక్ష్యం సంక్షేమం కలిసి నడుద్దాం