Hijab Row CJI : హిజాబ్ వివాదం ఇక సీజేఐ ముందుకు

ఏకాభిప్రాయం కుద‌ర‌ని భిన్నాభిప్రాయం

Hijab Row CJI : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన క‌ర్ణాట‌క హిజాబ్ వివాదంపై ఎలాంటి తుది తీర్పు వెలువ‌డ‌కుండానే భిన్నాభిప్రాయం వ్య‌క్త‌మైంది. ఇది ఒక ర‌కంగా మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. విద్యా సంస్థ‌ల్లో హిజాబ్(Hijab ) ధ‌రించి రావడాన్ని అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిషేధం విధించింది.

బ‌డులు, కాలేజీలు లేదా విద్యా సంస్థ‌ల‌కు వ‌చ్చే వారు ఎవ‌రైనా ఏ మతం వారైనా ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. తాము మ‌త విశ్వాసాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని కానీ అవి వ్య‌క్తిగ‌తం మాత్ర‌మేన‌ని పేర్కొంది. దీంతో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ తమ‌కు హిజాబ్ ధ‌రించేందుకు వీలు క‌ల్పించాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు సుప్రీంకోర్టులో.

గురువారం ఈ పిటిష‌న్ పై సుదీర్గ విచార‌ణ జ‌రిగింది. విచిత్రం ఏమిటంటే ఇద్ద‌రు జ‌డ్జీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసుకుపై తుది తీర్పు వెలువ‌రించ‌లేదు. కానీ భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు గుప్తా. మ‌రో న్యాయ‌మూర్తి పూర్తిగా కొట్టి పారేశారు.

అమ్మాయిల‌కు చ‌దువు ముఖ్యం కానీ ఈ ముసుగుపై రాద్దాంతం ఏమిటంటూ ప్ర‌శ్నించారు. ఇందుకు సంబంధించి ధ‌ర్మాసనం ముందు ప‌లు ప్ర‌శ్న‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇక ప్ర‌భుత్వం త‌ర‌పున న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపించారు. ప్రభుత్వం ఎవ‌రి ప‌క్షాన లేదా ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ తీయ‌లేద‌ని పేర్కొన్నారు.

చ‌దువు అనేది అంద‌రికీ స‌మాన‌మ‌ని ఇలాంటివి ఉపేక్షించ కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. చివ‌ర‌కు తుది తీర్పు వెలువ‌రించే బాధ్య‌త‌ను సీజేఐ(Hijab Row CJI) మీద వ‌దిలి వేసింది ధ‌ర్మాసనం.

Also Read : ఏపీలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!