Somu Veerraju : ఘటన బాధాకరం మృతులకు సంతాపం
బాధిత కుటుంబాలను సర్కార్ ఆదుకోవాలి
Somu Veerraju : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన గత కొన్ని రోజుల నుంచి ఇదేం ఖర్మ పేరుతో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరులో నిన్న సభ నిర్వహించారు. ఊహించని రీతిలో జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
దీంతో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. సభ ప్రాంగణం పక్కనే ఉన్న కాలువలో పడి పోయారు. హుటా హుటిన వారిని ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా కందుకూరు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ సోమూ వీర్రాజు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ ఏదైనా చనిపోయిన వారు ప్రజలు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సోమూ వీర్రాజు(Somu Veerraju) కోరారు.
బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, పార్టీ పరంగా ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు సోమూ వీర్రాజు.
ప్రతిపక్ష పార్టీల సభలకు పోలీసు భద్రత పెంచేలా చూడాలని సూచించారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు.
Also Read : ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బిజీ