Supreme Court : సెక్ష‌న్ 66ఎ కింద విచార‌ణ చెల్ల‌దు

సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

Supreme Court : భార‌త స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా కేంద్రానికి బిగ్ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌త కొంత కాలంగా పోలీసులు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ర‌ద్దు చేసిన సెక్ష‌న్ ను తిరిగి న‌మోదు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది సుప్రీంకోర్టు(Supreme Court). ఐటీ చ‌ట్టం లో ర‌ద్దు చేసిన సెక్ష‌న్ 66ఏ కింద ఏ పౌరుడి పైనా విచార‌ణ జ‌ర‌ప‌డానికి వీలు లేద‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాసనం.

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్ – 2000లోని సెక్ష‌న్ 66ఏ ప్ర‌కారం ఏ పౌరుడిని ప్రాసిక్యూట్ (విచార‌ణ‌) చేయ‌రాద‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పీపుల్స్ యూనియ‌న్ ఫ‌ర్ సివిల్ లిబ‌ర్టీస్ (పీయూసీఎల్) దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 66ఎ కింద ప్రాసిక్యూష‌న్ల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపి వేయాల‌ని పిటిష‌న్లు కోరారు.

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యుయు ల‌లిత్, జస్టిస్ ర‌వీంద్ర భ‌ట్ ల‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. సెక్ష‌న్ 66ఎ ఆన్ లైన్ పోస్టుల‌ను ఆక్షేప‌ణీయ‌, బెదిరింపు కోసం ఒక వ్య‌క్తిని అకార‌ణంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టేందుకు ప్ర‌భుత్వం అధికారం ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా ఇదే సెక్ష‌న్ ను 2015లో సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. అయినా పోలీసులు దీని పేరుతో కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. దీనిని స‌వాల్ చేస్తు పౌర హ‌క్కుల సంస్థ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

Also Read : ఐక్య‌రాజ్య‌స‌మితి ఓటింగ్ కు భార‌త్ దూరం

Leave A Reply

Your Email Id will not be published!