Rahul Gandhi Yatra : రేప‌టితో ముగియ‌నున్న జోడో యాత్ర

జ‌న‌వ‌రి 31న భారీ బ‌హిరంగ స‌భ

Rahul Gandhi Yatra : దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాల‌ని కోరుతూ దేశ వ్యాప్తంగా భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఆయ‌న చేప‌ట్టిన యాత్ర దేశంలో చ‌ర్చ‌కు దారి తీసింది. భారీ ఎత్తున జ‌నం ఆద‌రించారు. రాహుల్ గాంధీని అక్కున చేర్చుకున్నారు.

అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు జేజేలు ప‌లికారు. సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. జ‌న‌వ‌రి 30 సోమ‌వారంతో జోడో యాత్ర ముగియ‌నుంది. ఈ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 31న మంగ‌ళ‌వారం క‌ల్లోల కాశ్మీరం వేదిక‌గా భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది కాంగ్రెస్ పార్టీ. ఈ స‌భ‌కు దేశంలోని ప్ర‌ధాన పార్టీలకు ఆహ్వానం పంపింది.

ఇందులో మొత్తం 24 పార్టీలు ఉన్నాయి. రాహుల్ పాద‌యాత్ర‌కు(Rahul Gandhi Yatra) తృణ‌మూల్ కాంగ్రెస్ , స‌మాజ్ వాది పార్టీ, టీడీపీ దూరంగా ఉన్నాయి. భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా కొంద‌రు హాజ‌రు కాలేద‌ని ఆ పార్టీకి చెందిన వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ముగింపు స‌భ‌కు 12 ప్ర‌ధాన ప్ర‌తిపక్ష పార్టీల నేత‌లు ఇప్ప‌టికే స‌మ్మ‌తి తెలియ చేయ‌డం విశేషం.

ఇక ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే), శ‌ర‌ద్ ప‌వార్ నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), తేజ‌స్వి యాద‌వ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) , నితీశ్ కుమార్ సార‌థ్యంలోని జేడీయూ, ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ, సీపీఎం, సీపీఐ, విడుత‌లై చిరుతైగ‌ల్ క‌చ్చి (వీసీకే, కేర‌ళ కాంగ్రెస్ , నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ , పీడీపీ , షిబూ సోరేన్ సార‌థ్యంలోని జేఎంఎం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు.

Also Read : మ‌రాఠాలో స‌భ బీఆర్ఎస్ పాగా

Leave A Reply

Your Email Id will not be published!