Vaiko : సుప్రీంకోర్టు తీర్పు ఆమోద యోగ్యం కాదు
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అసమంజసం
Vaiko : ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం సబబే అంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు వైకో(Vaiko). ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అసంబద్దమైనదిగా పేర్కొన్నారు.
అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర సర్కార్ చట్ట సవరణ తీసుకు వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా సుప్రీంకోర్టు విచారణ అనంతరం తుది తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తులు సీజేఐ యూయూ లలిత్ , దినేష్ మహేశ్వరి, రవీంద్ర భట్ , బీలా త్రివేది, జేపీ పార్దీవాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఐదుగురిలో ముగ్గురు సమర్థించగా ఇద్దరు విభేదించారు. వారిలో సీజేఐ లలిత్, భట్ ఉన్నారు.
దీనిపై సీరియస్ కామెంట్స్ చేశారు వైకో. కేంద్రంలోని ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం దీనిని ముందుకు తీసుకు వచ్చిందని ఆయన ఆరోపించారు. 2019లో 10 శాతం కల్పిస్తూ చట్టం చేసింది. సామాజిక న్యాయ సిద్దాంతాన్ని నాశనం చేసేందుకు కేంద్ర సర్కార్ ఈ చట్టాన్ని తీసుకు వచ్చిందని ఆరోపించారు వైకో(Vaiko).
మండల్ కమిటీ కేసులో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. బీజేపీ సర్కార్ రాజ్యాంగంలో 103వ సవరణ తీసుకొచ్చి అగ్ర వర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
Also Read : దేశం చూపు ‘చంద్రచూడ్’ వైపు