S Jai Shankar : జి20కి నాయకత్వం దేశానికి దక్కిన గౌరవం
ఇక నుంచి మన సమర్థకు లభించిన అవకాశం
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జి20 శిఖరాగ్ర సదస్సులో భారత దేశం నిర్వహించిన పాత్ర అమోఘమన్నారు. ప్రస్తుతం జి20 గ్రూప్ కు భారత దేశం నాయకత్వం వహిస్తోంది. ఈ ఏడాది బాధ్యతలను దేశం తరపున స్వీకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఈ సందర్భంగా పటిష్టవంతమైన నాయకత్వం, సుస్థిర అభివృద్ది, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం దేశం పట్ల మరింత నమ్మకాన్ని పెంచేలా చేసిందన్నారు. ప్రపంచం ముందు ప్రధానంగా దేశం ముందు ప్రధాన సవాళ్లు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు జై శంకర్.
ముఖ్యంగా ఉగ్రవాదం, వ్యాపారం, వాణిజ్యంతో పాటు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని దీనిని అధిగమించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. మిగతా వాటితో పాటు ఆచరణీయ పరిష్కారాల కోసం కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గత కొంత కాలంగా భారత దేశం గణనీయమైన మార్పునకు లోనైంది. ప్రధానంగా ప్రపంచ వేదికగా తనదైన ముద్ర వేసిందన్నారు. గత కొన్నేళ్లుగా మన విదేశాంగ విధానం పూర్తిగా తటస్థంగా ఉందన్నారు. తాము ఎవరితోనూ యుద్దానికి దిగడం లేదని కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు జై శంకర్(S Jai Shankar).
ఇది పూర్తిగా గ్లోబల్ సౌత్ వాయిస్ గా మారే సమయం కూడా అని పేర్కొన్నారు. ఇది మరో దౌత్య పరమైన సంఘటనగా పరిగణించాల్సిన పరిణామం మాత్రం కాదన్నారు జై శంకర్.
Also Read : సీజేఐ సంచలన నిర్ణయం మహిళా ధర్మాసనం